
కరీంనగర్: కలెక్టరేటు ఆడిటోరియం ఆధునీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ ఆడిటోరియంబ ఆధునీకరణ కలెక్టరేట్ మరమ్మత్తు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునీకరణ పనులను యుద్ద ప్రాతిపదికన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆడిటోరియం టాయిలెట్ బ్లాకుల మధ్యలో గల గోడలను తొలగించి విశాలంగా నాణ్యతతో నిర్మించాలని ఆదేశించారు. కలెక్టరేటు మరమ్మత్తు పనులలో వేగం పెంచాలని పనుల ప్రగతి పై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేటులో నిర్మించిన ఇంకుడు గుంతలను కలెక్టర్ పరిశీలించారు. ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని మరిన్ని ఇంకుడు గుంతలు కలెక్టరేటు పరిసరాలలో నిర్మించి వర్షపు నీటిని బయటికి పోకుండా చూడాలని ఆదేశించారు. ఎక్త్సెజ్ కార్యాలయం ముందు గల గార్డెన్ నిర్వహణ సరిగా లేదని గార్డెన్లో పూల మొక్కలు, పండ్ల మొక్కలు నాటి ఆహ్లదకరంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేటులో ఎక్కువ పూల మొక్కలు నాటి వాటి ఫినిషింగ్ చేసి రక్షించాలని అన్నారు. కలెక్టరేటుకు వచ్చు సందర్శకులకు నీడ నిచ్చు మొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెవిన్యూ అధికారుల గృహ సముదాయంలో జెసితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీదేవ సేనా, జిల్లా రెవెన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య, కలెక్టరేటు ఎఓ రమేష్, కలెక్టరేటు మరమ్మత్తుల పర్యవేక్షక ఇంజనీర్ రాజేశ్వరరావు, కలెక్టరేటు
కేర్ టేకర్ ఇ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.