‘ఆడపిల్ల’.. అగ్గిపుల్ల.. ఆగమైంది..

అప్పటికే ఆమె ఓ గొప్ప గాయని.. తెలంగాణ పాటల పూదోటలో వెరిసిన చిన్ని గులాబీ.. చిన్న వయసులోనే దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు పొందిన యువ కళాకారిణి.. కానీ ప్రేమ మత్తులో పడి తల్లిదండ్రులను కాదంది.. నిండైన జీవితం ముందుండగా.. అన్నీ వదులుకొని ప్రియుడిని గుడ్డిగా నమ్మి ముందుకెళ్లింది.. కానీ తరువాత తత్వం బోధపడి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ గడపతొక్కింది. ప్రేమ మైకం దిగి ఆస్పత్రి పాలైంది..

‘3 మంత్స్ హ్యాపీ.. నెక్ట్స్ స్ట్రగుల్ స్టార్టెడ్’ ఇది ఫేమస్ డైలాగ్.. ప్రేమలో అన్ని ఇష్టంగా తోస్తాయి.. కానీ పెళ్లి అయితేనే తెలుస్తుంది అది ప్రేమ.. దోమానా.. తల్లిదండ్రులను ఎదురించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్న మధుప్రియ జీవితం ఆగమాగమైంది. ఆమె పెళ్లైనా ఆరు నెలలకే భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని రోడ్డున పడింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తన లవర్ బాయ్ దెబ్బలు కొట్టాడని విలేకరుల ముందు బోరుమని సొమ్మసిల్లిపడిపోయింది.

ప్రేమ మైకంలో మునిగి ఆకర్షననే ప్రేమంటూ వెళ్లిన ఈ చిరు పక్షి చివరికి తత్త్వం బోధపడి ప్రియుడిపైనే కేసు పెట్టింది. ఆరు నెలల క్రితం వరకు మీడియాలో, పత్రికల్లో ఇరువురు చిలకా గోరింకల్లా కనిపించన వారే నేడు పాము ముంగిసల్లా కొట్లాడుకున్నారు. చిన్న వయసులో ప్రేమ, వ్యామోహమే తెలియకుండా ముందడుగు వేస్తే ఇది గతి పడుతుందని పలువురు విమర్శిస్తున్నారు.
మధుప్రియ జీవితం అందరికీ ఓ గుణపాఠంలా నిలుస్తుందనడంలో సందేహం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *