ఆటలో అరటిపండు

kcr jana errabelli

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ శాసనసభ సమావేశాలు మహా రంజుగా నడుస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ వ్యూహానికి ప్రతిపక్షాలు చిత్తవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ కొరకరాని కొయ్యగా తయారవుతుందనుకున్నారు. కానీ చాలా చతురతతో వారిపై సస్పెన్షన్ వేసిన కేసీఆర్ బ్యాచ్ వ్యూహం ముందు టీడీపీ షాక్ కు గురయ్యింది.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల ఆటలో అరటిపండు అయ్యింది ఎవరూ అంటే మన జానారెడ్డి సాబే.. సీఎం కేసీఆర్ చాలా పకడ్బందీగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నడిపించేందుకు జానారెడ్డిని పావుగా వాడుకుంటున్నారు. ‘మాటకు ముందు గౌరవనీయులు, పెద్దలు జానారెడ్డి’ అంటూ కాంగ్రెస్ టీంను ఆయన చేతనే కంట్రోల్ పెడుతున్న వ్యూహం కాంగ్రెస్ నేతలను అయోమయానికి గురిచేస్తోంది. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జానారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయనను ఎదురించలేని దుస్థితి.

సీఎం కేసీఆర్ జానాను పొగుడుతూ మిగితా కాంగ్రెస్ నాయకుల అవినీతిని.. కాంగ్రెస్ హయాం దోపిడీని ఎండగడుతున్నారు. పైగా కాంగ్రెస్ మద్దతుతోనే టీడీపీ అల్లరి చేస్తోందంటూ వారి పై వేటు వేయించాడు. ఎంతో వ్యూహాత్మకంగా సాగుతున్న ఈ తంతులో జానారెడ్డి ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఆటలో అరటిపండు మాత్రం ఆయనే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *