ఆగ‌స్టు 2నుండి ఉనికిలోకి 4383 నూత‌న గ్రామ‌ పంచాయ‌తీలు

ఆగ‌స్టు 2నుండి ఉనికిలోకి 4383 నూత‌న గ్రామ‌ పంచాయ‌తీలు

నూత‌న పంచాయ‌తీల‌కు భ‌వ‌నాల ఏర్పాటు, ఉద్యోగులు, ఆస్థుల‌ విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయాలి

పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను యుద్ద ప్రాతిక‌దిక‌న పూర్తి చేయాలి

పాల‌క‌వ‌ర్గం ఉన్నా… ప్ర‌త్యేకాధికారిని నియ‌మించినా అభివృద్ధి

ప‌నుల‌కు ఆటంకం లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి

క్ల‌స్ట‌ర్ల విభ‌జ‌న‌, కార్య‌ద‌ర్శుల రేష‌న‌లైజేష‌న్ కూడా త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేయాలి

హ‌రిత‌హారాన్ని ఉద్య‌మంలా చేప‌ట్టాలి, గ్రామ‌గ్రామాన న‌ర్స‌రీల ఏర్పాటు పూర్తి చేయాలి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు, జెడ్పి సీఈఓ లతో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్, స‌చివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న‌ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్

హైద‌రాబాద్‌- ఆగస్టు 2 నుండి ఉనికి లోకి రానున్న 4 383 నూతన గ్రామ పంచాయతీల్లో మౌళిక స‌దుపాయాల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌న ఏర్పాటు చేయాల‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు, జెడ్పి సీఈఓ లతో గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ నెలాఖ‌రుతో పంచాయ‌తీల పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. అలాగే వ‌చ్చే నెల 2 నుండి కొత్త‌గా పంచాయతీలకు భవనాల ఏర్పాటు, ఉద్యోగుల విభజన, ఆస్తుల విభజన తదితర అంశాలను నాలుగైదు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 14 వ ఆర్థిక సంఘం నిధుల‌ను కూడా జనాభా ప్రాతిప‌దిక‌న విభ‌జించి, కొత్త పంచాయ‌తీల‌కు అప్ప‌గించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అలాగే అవ‌స‌ర‌మైన చోట క్ల‌స్ట‌ర్ల విభ‌జ‌న కూడా పూర్తి చేసి… గ్రామ కార్యదర్శులను జనాభా ప్రాతిపదికన రేషనలైజేషన్ చేయాలని ఆదేశించారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న 3500 మంది పంచాయ‌తీకార్య‌ద‌ర్శుల‌ను జ‌నాభా
ప్రాతిప‌దిక‌న రేష‌న‌లైజేష‌న్ చేయాల‌న్నారు. ఈ లెక్క‌న నాలుగైదు గ్రామాల‌కు, ఐదారువేల జ‌నాభాకు ఒక కార్య‌ద‌ర్శి ఖ‌చ్చితంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

దేనికైనా సిద్దంగా ఉండండి

నెలాఖ‌రుతో పంచాయ‌తీల పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగుస్తుంద‌ని…ఆ త‌ర్వాత అభివృద్ధి ప‌నుల‌కు ఎలాంటి ఆటంకం క‌ల్గ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పంచాయ‌తీ పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలాన్ని పొడిగించినా లేదా ప్ర‌త్యేకాధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించినా సిద్దంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను మంత్రి జూప‌ల్లి కోరారు. జిల్లాలో ఉన్న గ్రామాల సంఖ్య‌కు అనుగుణంగా ప్ర‌త్యేకాధికారులుగా నియ‌మించేందుకు నాలుగైదు రోజుల్లోనే జాబితాలు సిద్దం చేసుకుని స‌న్నద్ధంగా ఉండాల‌న్నారు. పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం పొడిగించినా…ప్ర‌త్యేకాధికారుల‌ను నియ‌మించినా ప్ర‌జ‌ల‌కు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు. అలాగే హ‌రిత‌హారం, ఉపాధి హామీతో పాటు ఏ ఒక్క అభివృద్ధి ప‌నికి ఆటంకం క‌ల్గ‌కుండా చూసుకోవాల‌న్నారు. ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని… నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టం ప్ర‌కారం ప్రతి గ్రామంలోనూ నర్సరీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ఉపాధి హామీలో భాగంగా సీజ‌న‌ల్ ప‌నుల‌న్నీ ఇప్ప‌టికే పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని…ఇందుకోసం దాదాపు 9కోట్ల ప‌నిదినాల‌ను వినియోగించుకున్న‌ట్లు పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్ తెలిపారు. రానున్న రెండు, మూడు నెలల్లో దాదాపు 4 కోట్ల ప‌నిదినాల‌ను హ‌రిత‌హారం కోసం వినియోగించేందుకు ప్ర‌ణాళికలు సిద్దం చేస్తున్నామ‌న్నారు. స‌చివాల‌యం నుండి వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పంచాయ‌తీరాజ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, అధికారులు ఆశా, రామారావు, సుధాక‌ర్‌, సైదులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

jupally krishna rao 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *