ఆగస్టు 15లోగా హరితహరం మొక్కలు నాటే లక్ష్యాలను పూర్తి చేయాలి

కరీంనగర్: రాష్ట్ర్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న తెలంగాణకు హరితహరం కార్యక్రమంలో జిల్లాలకు నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఆగస్టు 15 లోగా మొత్తం మొక్కలు నాటడం పూర్తి చేయాలని రాష్ట్ర్ర అటవి శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం హరితహరం కార్యక్రమం అమలుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఆదిలాబాదు నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరితహరం కార్యక్రమాన్ని రాష్ట్ర్ర ముఖ్యమంత్రి ప్రతిరోజు సమీక్షిస్తున్నారని, మంత్రులు జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమం మరింత వేగం పెంచాలని ఆదేశిస్తున్నారని అన్నారు. జిల్లాలకు అవసరమైన ఈత మొక్కలు, పండ్ల మొక్కలు, టేకు మొక్కలు, ఇతర జిల్లాల నుండి అంచలంచలుగా కొనుగోళు చేసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలను నీరు పోసి రక్షించుటకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. హైదరాబాదు నుండి రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ ప్రతి నియోజక వర్గానికి 40 లక్షలు, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కలన్నింటికి రక్షణగా ట్రిగార్డులు, కంచేలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను వచ్చే వర్సాకాలం వరకు నీరు పోసి రక్షించుటకు కావలసిన నిధులు 2017 మార్చి వరకు, ఏఫ్రిల్ నుండి జూన్ వరకు ఎన్ని నిధులు అవసరమో అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. వచ్చే సంవత్సరం హరితహరంలో మొక్కలు నాటుటకు వీలుగా ముందుగానే నర్సరీలలో ఏ రకమైన మొక్కలు నాటాలో ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రజలకు కావలసిన మొక్కలను మాత్రమే ఎక్కువ పెంచాలని వచ్చే సెప్టెంబర్ నుండి నర్సరీలో మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం కన్నా 20 శాతం మొక్కలు ఎక్కువగా నర్సరీలలో పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా ఎస్పి జోయల్ డేవిస్, అదనపు ప్రిన్సిపల్ చిఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై. బాబురావు, డి.ఎఫ్.ఓ లు రవికిరణ్, వినోద్ కుమార్, మహేందర్ రాజు, అదనపు జెసి నాగేంద్ర, డ్వామా పిడి వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ సీఈఓ సూరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

VIDIO CONFIRENCE

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *