Breaking News

ఆకుపచ్చతోనే బంగారు తెలంగాణ

ఆకుపచ్చతెలంగాణాతో బంగారు  తెలంగాణ

ఆకుపచ్చతెలంగాణాతో బంగారు తెలంగాణ

సిరిసిల్ల : ఆకుపచ్చ తెలంగాణతో బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని రాష్ర్ట పంచాయితిరాజ్, ఐటి శాఖామంత్రి కె.తారకరామారావు అన్నారు. శనివారం సిరిసిల్ల మండలం  తాడూర్ అనుబంధ గ్రామం గోపాల్రావుపల్లిలో, సిరిసిల్ల బైపాస్ వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల కోసం పచ్చదనం ఎంతో అవసరమన్నారు. నేటి పరిస్త్తితుల్లో వానలు టైంకు కురవకపోవడంతో, ఎండాకాలంలో రాళ్లవానలకు కారణం వనాలు అంతరించిపోవటమేనన్నారు. ప్రపంచ చరిత్రలోనే మూడవ అతిపెద్ద ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందన్నారు.

ఆకుపచ్చతెలంగాణాతో బంగారు  తెలంగాణ: కల్వకుంట్ల తారక రామారావ

ఆకుపచ్చతెలంగాణాతో బంగారు తెలంగాణ: కల్వకుంట్ల తారక రామారావ

చైనాలో గోబి ఎడారి విస్తరించకుండా ఏకకాలంలో 800 కోట్లు, బ్రెజిల్ లో పర్యవరణ సమతుల్యానికి 400 కోట్ల మొక్కలు నాటటం జరిగిందని, నేడు మన తెలంగాణ ప్రభుత్వం రాబోయే 3 – 4 ఏళ్లలో 230 కోట్ల మొక్కలు నాటటం లక్ష్యంగా ముందుకు వెళుతుందని అన్నారు. 40 కోట్ల మొక్కలు ఈ ఒక్క ఏడాదిలోనే నాటటం జరుగుతుందన్నారు. ఇది పూర్తిగా ప్రజలు కార్యక్రమమని, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, రాజకీయ ఉద్దేశం ఏమాత్రం లేదని పర్యవరణ సమతుల్యానికి, భావి తరాలకు ఎంతో అవసరమనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి మాట కోతులు వాపస్ పోవాలి..వానలు వాపస్ రావాలి అనేది నినాదంగా అన్ని వర్గాల వారు సంవూర్ణ సహకారం, భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలన్నారు. హరితహారం కార్యక్రమానికి అటవీ శాఖ సమన్వయంతో పంచాయితిరాజ్ శాఖ నుండి సుమారు 550 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుందన్నారు.

DSCN5030ఏ ఏ రకాల మొక్కలు కావాలన్నా, ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి సిద్దంగా వుందని, ఇండ్లు, పాఠశాలలు, సంస్థలు, రహదారులు, ఖాళీ స్థలాలు అంతటా మొక్కలు నాటాలని, మొక్కలు నాటటమే కాకుండా, వాటిని పసి పిల్లవాడిన చూసుకున్నట్లు రెండు, మూడేండ్లు కాపాడాలని మంత్రి అన్నారు.
గోపాల్రావుపల్లి గ్రామానికి ఎన్ని నిధులు వెచ్చించి అభివృద్ది పరచామన్నారు. పంచాయితిరాజ్ శాఖనుండి 1.70 కోట్లలో 3 కి.మీ. రోడ్డు,  గ్రామంలో అంతర్గతంగా 20 లక్షలతో సిసి రోడ్లు,  డ్రైయినేజిలు,  25 లక్షలతో మహిళా, రెడ్డి సంఘ భవనాలు, 3 సి సి రోడ్లు, ఆర్ డబ్య్లూఎస్ శాఖ నుండి 2 కొత్త వాటర్ ట్యాంకులు,  పైప్ లైన్ ల నిర్మాణానికి 47 లక్షలు,  వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణకు 3 లక్షలతో పంపుసెట్, మపైప్ లైన్ లు నిర్మించినట్లు మేడిపల్లి చెరువు పునరుద్దరణకు 25 లక్షలు, గ్రామంలో 302 మంది రైతులకు 1.27 కోట్ల రుణమాఫి చెల్లింపు, వ్యవసాయ గిడ్డంగి నిర్మాణానికి 40లక్షలు మంజూరుచేసినట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలే కాక, కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ వంటి మరెన్నో సంక్షేమ పథకాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గ్రామ పాఠశాల కాంపౌండ్ నిర్మాణానికి నిధులు మంజూరుచేస్తానని మంత్రి అన్నారు. తమది పేదల ప్రభుత్వమని, పేద ప్రజలు బాధపడకుండా చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కోడూరి రవిందర్ రావు, సిరిసిల్ల ఆర్డీవో బి.బిక్షానాయక్, సిరిసిల్లా డిఎస్పి దామెర నర్పయ్య, డ్వామా పిడి వైవి గణేష్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట జడ్పిటీసీలు పూర్వాణి మంజుల, తోట ఆగయ్య, సిరిసిల్ల మునిసిపాల్ చైర్మన్ సామల పావని, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణ, ఎంపిటిసి లక్ష్మి, సర్పంచ్ ఏసిరెడ్డి, తహసిల్దార్ శంకరయ్య, ఎంపిడివో మదన్ మోహన్, డివిజన్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *