ఆకాశం నుంచి తిరిగొచ్చిన రాకెట్

అమెరికా: అమెరికా శాస్త్రవేత్తలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.. నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లిన రాకెట్ ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చి ఎవరూ చేయలేని పనిని చేసి చూపించారు. తొలిసారి శక్తివంతమైన పాల్కన్-9 రాకెట్ ను దిగ్విజయంగా భూమిపై దింపి రాకెట్లనూ విమానాల్లా వినియోగించుకునేందుకు బాటలు పరిచారు..

అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ అంతరిక్ష కేంద్రంలో సోమవారం రాత్రి ఈ రాకెట్ దిగింది.. 11 అర్బ్ కామ్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టాక దిగ్విజయంగా తిరిగి వచ్చినట్లు స్పేస్ ఎక్స్ ట్విట్టర్ లో పేర్కొంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *