Breaking News

ఆకాశంలో మోడీ, కేసీఆర్ ఫైట్

galipatam

హైదరాబాద్, ప్రతినిధి : సంక్రాంతి సందర్భంగా ఆకాశంలో మోడీ,కేసీఆర్ ఫైట్ చూడబోతున్నాం.. వారేంటి? ఆకాశంలో ఫైట్ ఏంటి ? అనుకుంటున్నారా.? కానీ ఇది నిజం వారు ఆకాశంలో తలపడబోతున్నారు. కానీ వ్యక్తులుగా కాదు.. గాలిపటాల రూపంలో.. ఎన్నడూ లేనంతగా ఈసారి నాయకుల ముఖ చిత్రాలతో పతంగులు మార్కెట్లు ముంచెత్తాయి. ముఖ్యంగా నరేంద్రమోడీ, కేసీఆర్ ల ముఖ చిత్రంతో ముద్రించిన గాలిపటాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.. నాయకులపై అభిమానంతో నాయకులు, ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఎక్కువగా కొంటున్నారట.. ముఖ్యంగా మోడీ, కేసీఆర్ గాలిపటాలకు విపరీతమైన డిమాండ్ ఉందని దుకాణాదారులు చెబుతున్నారు..

ఈసారి  సంక్రాంతి పతంగుల పండగ కాస్తా ఆకాశంలో మోడీ, కేసీఆర్ ల ఫైట్ గా మారబోతోంది. గాలిపటాల్లో వీరి ముఖచిత్రాలతో ఉన్న పతంగులను గాలిలోకి ఎగుర వేసి జనం ఆనందించబోతున్నారు. మరి వీరిలో ఎవరు గెలిచినా .. ఓడినా.. అందంతా సరదాకే.. కానీ పొలిటిషన్స్ ను కూడా ఇలా వాడుకుంటూ క్రియేట్ విటీ కొత్త భాష్యం చెప్పారు తయారీదారులు.. జనానికి వినోదం. అమ్మేవారికి సంపాదన.. వాట్ ఎన్ ఐడియా సర్ జీ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *