ఆకాంక్ష ఉన్నా… ఆలస్యమైంది

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జేవీ నరసింగరావు శత జయంతి ఉత్సవాలు బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ జేవీ నరసింగారావు స్థానిక సమస్యలను పరిష్కరించడంలో విశేషమైన కృషి చేశారని అన్నారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా వచ్చిన తెలంగాణను అడ్డుకోవడానికి ఎంతో మంది ఎన్నో విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సాధించిన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించాలని ఎంత ఆకాంక్ష ఉన్నా సాధించుకోవడానికి అనేక సమయం పట్టిందని తెలంగాణ సాధనను చూసిన వారంతా ధన్యజీవులని సీఎం వ్యాఖ్యానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *