ఆకట్టుకున్న లహరి ముగ్గుల పోటీ

ఆకట్టుకున్న లహరి ముగ్గుల పోటీ

కరీంనగర్: సంక్రాంతి పండగ సందర్భంగా కరీంనగర్ లోని లహరి హైట్స్ లో గురువారం నిర్వహించిన ముగ్గుల పోటీ పలువురిని ఆకట్టుకుంది. ఈ ముగ్గుల పోటీల్లో అనిత వేసిన ముగ్గుకు ప్రధమ బహుమతి లభించింది. నీలిమకు ద్వితియ, పద్మజకు తృతీయ బహుమతులు లభించాయి. సరిత, వెన్నెల, శ్వేత, సౌమ్య ల ముగ్గులు కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలకు లహరి హైట్స్ గౌరవ అధ్యక్షులు అయిలు రమేష్, అధ్యక్షులు ఎం.రమేష్, కార్యదర్శి సిరిపురం వేణుకుమార్, ఆవుల సరోజ లు బహుమతుల ప్రదానం చేశారు. న్యాయ నిర్ణేతలుగా ఆవుల కన్యాకుమారి, వర్షలు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో జారతి మధుమోహన్, చీకోటి శేఖర్, మహేష్, ఆవుల వినోద్, రంజిత్, వంశీ తదితరులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *