
ఆంధ్రా నుంచి వచ్చే ప్రైవేటు బస్సులు ఇక తెలంగాణకు ఆగిపోనున్నాయి.ఈ ఏప్రిల్ 1 నుంచి ఏపీ నుంచి వచ్చే వాహనాలపై ఇతర రాష్ట్రాల మాదిరే పన్ను విధిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లు వందల సంఖ్యలో వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇక హైదరాబాద్ కు తమ వాహనాలను నిలిపివేశాయి. బుకింగ్ లను కూడా ఆపివేశాయి. తెలంగాణ జీవో ప్రకారం ఇతర రాష్ట్రాల వలె ఆంధ్రా వాహనాలపై పన్ను విధిస్తే సగటున లక్షకు పైగానే పన్ను చెల్లించి ఇటు సర్వీసులు నడుపుకోవాలి. ఇంత భారం మోయలేక సర్వీసులనే నిలుపుదల చేయాలని నిర్ణయించాయి ఆంధ్రా ట్రావెల్స్ బస్సులు.
కాగా ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో మార్చి 31 వరకు ఆంధ్రానుంచి వచ్చే వాహనాలకు పన్ను మినహాయింపునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం గత జనవరిలోనే ఆంధ్రా వాహనాలపై పన్ను విధించినా హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో మార్చి 31వరకు ఆంధ్రావాహనాలపై పన్ను సడలింపును ఇచ్చింది. కాగా గడువు తీరిపోవడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. ఆంధ్రావాహనాలపై బారీగా పన్నును ఈ ఏప్రిల్ 1నుంచి అమలు చేయనున్నారు. దీనివల్ల ఆంధ్రా ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు చెక్ పడి.. ఆర్టీసీ ఆదాయం భారీగా పెరుగనుంది.