ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్తత

తమిళ ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా తమిళనాడు అట్టుడుకిపోతోంది.  ఎన్ కౌంటర్ కు నిరసనగా ఎండీఎంకే అధినేత వైగో చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడించేందుకు బయలు దేరారు. దీంతో వైగోను వేలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 500 మంది కార్యకర్తలతో వేలూరు నుంచి చిత్తూరు కు ర్యాలీ నిర్వహించేందుకు యత్నించిన వైగోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వేలూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రమంతా తమిళుల ఆందోళనతో మారుమోగుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *