‘ఆంధ్రోళ్ల బూట్లు నాకలేదు’-మంత్రి జగదీశ్ రెడ్డి

jagadeesh-reddy.jpg dk aruna

తెలంగాణ అసెంబ్లీలో మారోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి వివాదాస్పదంగా మంత్రి డీకే అరుణపై నోరుపారేసుకున్నారు.. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసనను సభలో తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్టు అంశంపై డీకే అరుణ మాట్లాడుతూ తొలిసారి ఎన్నికైన జగదీశ్ రెడ్డి విద్యుత్ మంత్రిగా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోవడం లేదని.. ఆయన చాలా నేర్చుకోవాలని అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి మీలాగా ఆంధ్రానేతల బూట్లు నాకలేదని.. స్వంతంగా ఎదిగిన తనకు ఏ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి చేయాలో తెలుసన్నారు. తాను కేసీఆర్ చలవ, సూర్యపేట ప్రజల ఆశీస్సులతో మంత్రినయ్యానని తెలిపారు.

దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేవఆరు. కాంగ్రెస్ సభ్యులు పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో మంత్రి సభకు క్షమాపణ చెప్పారు. అయినా గొడవ సద్దు మణగకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *