Breaking News

ఆంధ్రోళ్ల ఓట్లు తొలిగించినందుకే..

ghmc

హైదరాబాద్ : గ్రేేటర్ పీఠం దక్కించుకునేందుకు టీఆర్ఎస్  ప్లాన్ బెడిసి కొట్టింది.. హైదరాబాద్ లోని దాదాపు 25 లక్షల మంది ఆంధ్రావాళ్ల ఓట్లను తొలగించేందుకు నిర్ణయించింది. తొలిదశలో 6.30 లక్షల ఓట్లను తొలగించింది.. మరో 19 లక్షల ఓట్లను కూడా తొలగించి గ్రేటర్ లో తెలంగాణ ఓట్లతో పీఠం దక్కించుకోవాలని చూసింది.. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది.

భారీగా ఓట్లు తగ్గిస్తున్నారంటూ జీహెచ్ఎంసీపై ప్రతిపక్షాలు, ఓటర్ గల్లంతైన వారు కేంద్ర ఎన్నికల సంఘాని కి ఫిర్యాదు లు భారీగా చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.  14 మంది అధికారులతో పశ్చిమ బెంగాల్ ఈసీ కమిషనర్ సునీల్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో క్షేత్రస్థాయి సర్వే జరిపి ఓటర్లపై విచారణ జరుపుతుంది.

ఈ పరిణామాలు టీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు. ఆంధ్రోళ్ల ఓట్లు తగ్గించి గెలవాలనుకున్న టీఆర్ఎస్ కు ఇప్పుడు ఈసీ విచారణతో ఓటర్లు పెరిగి ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం వస్తుందని భయం మొదలైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *