
హైదరాబాద్, ప్రతినిధి : ఏపీ ఉద్యోగులు, సీఎంలు, అధికారులు హైదరాబాద్ లో ఉంటే తెలంగాణకు మేలేనని.. వారి ఏపీ నుంచి జీతాలు తీసుకొని తెలంగాణ పన్నులు కడతారని సీఎం కేసీఆర్ అన్నారు. సచివాలయంలో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ ఆంధ్రోళ్లు శాశ్వత టూరిస్ట్ లు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇస్తే పోటీగా ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చారని.. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం వల్ల ఏపీ ఉద్యోగుల జీతాలు పెరిగాయని సీఎం కేసీఆర్ అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కరెంటు ఇవ్వకపోవడమే మంచిదైందని.. ఒక వేళ ఇచ్చి ఉంటే రూ.7.20కి 25 ఏళ్ల పాటు కొని మనం ఉత్పత్తి చేసిన విద్యుత్ ను రూ.3.70కే చెల్లించాల్సి వచ్చేదని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు కరెంటు ఇవ్వకుండా చంద్రబాబు మేలే చేశాడని.. రాబోయే రెండేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామని చెప్పుకొచ్చారు. కేంద్రం, అధికారులు చెప్పినా సీఎం చంద్రబాబు కరెంటు ఇవ్వకుండా తెలంగాణను బదనాం చేయడానికి ప్రయత్నించాడని.. కానీ మూడేళ్లలో అభివృద్ది చేసి చూపిస్తామన్నారు.