ఆంధ్రా రాజకీయాలే వేరప్ప..

హైదరాబాద్ : 60 ఏళ్లుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పెత్తనం చెలాయించిన ఆంధ్ర రాజకీయాల్ని చాలా తక్కువగా అంచనా వేశారు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. ‘తరాలుగా తెలంగాణకు అన్యాయం జరిగింది… ఎలా దోపిడీ జరిగిందో.. తెలంగాణ నేతలను ఎలా బ్లేమ్ చేసారో..  సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా నేతల ఆదిపత్యం కొనసాగిందీ.. ఇప్పుడూ అలానే కొనసాగిస్తున్నారని అర్థమైంది.. అందుకే సమైక్య ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ వారు సీఎం గా చేసింది చాలా తక్కువ సంవత్సరాలు.. 60 ఏళ్లలో 90శాతం ముఖ్యమంత్రులు ఆంధ్రావారే.. అంతలా ఆదిపత్యం చెలాయించి ఇప్పుడు తమపై ఆదిపత్యానికి గవర్నర్ ప్రయత్నిస్తే ఊరుకుంటారా..? అందుకే ఈ వారి దాడి కొనసాగిస్తున్నారు. గవర్నర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు..

మీడియానే వారి ఆయుధం

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రావారి ఆదిపత్యం కొనసాగిందంటే ప్రధానంగా వారు ఎంచుకున్న ఆయుధం పత్రికలు, న్యూస్ చానెళ్లు.. అప్పట్లో న్యూస్ చానెళ్లు లేవు.. అందుకే బలమైన పత్రికలను స్థాపించి ఆంధ్రా ఆదిపత్యాన్ని చాటారు. ప్రభుత్వాన్నే శాసించేలా పత్రికలకు ప్రోత్సాహాన్నిచ్చి ముందు నిలిపారు. ఆనాడు తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి కావడానికి ఈనాడు పత్రికే కారణం.. తదనంతరం ఎన్టీఆర్ మాట వినడం లేదని చంద్రబాబుకు ఈనాడు సాయం అందించడం అంతే వాస్తవం. తరువాత చంద్రబాబు పాలనలోనూ ఈనాడు వైఖరిపై విసుగు చెంది ఆంధ్రజ్యోతి పత్రిక స్థాపనలో టీడీపీ అధినేత చంద్రబాబుది కీరోలే.. ఇలా ఆంధ్రా రాజకీయ చరిత్రలో పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి. తమ రాజకీయ భవిష్యత్తుకు సోపానంలా పత్రికల్ని భావించారు నేతలు..

నరసింహన్ పై గురి

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలకు గవర్నర్ అయిన నరసింహన్ నిర్ణయాల్లో తెలంగాణకు మేలు చేశారు. ఇక్కడి పరిస్థితులు.. ఆంధ్రా ఆదిపత్యం.. కొనసాగుతుందని గ్రహించి తెలంగాణ ప్రభుత్వానికి కాసింత సహకరించారు. దీనిపై శరామామూలుగానే చంద్రబాబు ఆంధ్రా నేతలు గుస్సా అయ్యారు. తమపై ఆదిపత్యాన్ని సహించాని వారు ఇప్పుడు ఏకంగా మీడియా ను అడ్డుపెట్టుకొని గవర్నర్ పై పిచ్చి రాతలు రాస్తూ ఆయన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు. బ్లేమ్ గేమ్ తో గవర్నర్ ను తమ దారికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా తాను న్యాయం వైపే ఉంటానని నిన్న గవర్నర్ స్పష్టం చేయడం ఇందులో కొత్త మలుపు.

గవర్నర్ తో కేసీఆర్ భేటి..

నల్గొండ కాల్పుల ఘటనపై సీఎం కేసీఆర్ ..గవర్నర్ తో భేటి అయ్యారు. ఇందులో భాగంగా ఆంధ్రా మీడియా గవర్నర్ పై అనుచిత రాతలు రాయడాన్ని వారు చర్చించారు. దీనిపై తొందరపడవద్దని తగిన సమయంలో దీనిపై ధీటుగా స్పందింద్దామని గవర్నర్ కేసీఆర్ తో అన్నారట.. ఇలాంటి బ్లేమ్ గేమ్ తోనే తెలంగాణను ఇన్నాళ్లు ఆగం చేశారని సీఎం కేసీఆర్ గవర్నర్ కు ఆంద్రా నేతల తీరును వివరించారట.. దీనిపై నరసింహన్ ఏం చేస్తారో వేచిచూడాల్సిందే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *