Breaking News

‘ఆంధ్రా రచయితలు దొరకలేదట..’

Telangana_writers_

‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో వేరువేరుగా రెండు ప్రాంతాల్లో సాహితీ సమీక్షలు నిర్వహించారట.. తెలంగాణలో నిర్వహించిన ఈ సమీక్షకు గద్దర్, అందెశ్రీ, అల్లం నారాయణ, గోరెటి వెంకన్న, లాంటి ఎంతో మంది తెలంగాణ కవులు, రచయితలు హాజరై తమ అనుభవాన్ని ఉపయోగించి.. సాహిత్యంపై అద్భుతంగా ప్రసంగించారు.. పాటాలు పాడారు.. ఈ సమీక్షను దిగ్విజయం చేశారు.. ’’

కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో సాహితీ సమీక్ష నిర్వహిస్తే పేరున్న ఎవరూ రాలేదట.. తెలంగాణ లో ఉన్న కవులు, రచయితలు, కళాకారులు ఆంధ్రలో లేకపోవడమే రాకపోవడానికి కారణం. ఆంధ్రలో నిర్వహించే కార్యక్రమానికి ఎవరిని పిలువాలో తెలియక హెచ్ఎంటీవీ నిర్వాహకులు సతమతమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో భూతద్దం పెట్టి వెతికినా కళాకారులు, రచయితలు కనిపించలేదు. ఒక్క ఉత్తరాంధ్ర నుంచి వంగపండు మాత్రం వారికి దొరికాడు. 13 జిల్లాల్లో అసలు కవులే దొరకలేదట..అదీ ఆంధ్రా పరిస్థితి.. తెలంగాణ వైభవం..

తెలంగాణ ఎప్పుడూ తన భాష, సంస్కృతి, కళలను కొనసాగిస్తూనే వస్తోంది. ఇక్కడ చదువు రాకపోయినా మన పాటల్ని, రచనల్ని మన భావి తరాలకు ఇష్తూ వస్తున్నాం.. కానీ ఆంధ్రలో కార్పొరేటికరణ వల్ల రచయితలు, కళకారులు ఉదయించలేదు. కేవలం డబ్బు సంపాదన, ఉన్నతస్థానం మాత్రమే లక్ష్యంగా వారి మనగుడ, ఆలోచనలు వెళ్లాయి.. అందుకే అక్కడ కళాకారులు, రచయితలకు కొరత ఏర్పడింది..

తెలంగాణలో ఇప్పటికీ వందలాది మంది కళాకారులు తమ రచనలతో , కవిత్వంతో అలరిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఎప్పటినుంచో వలస బాధితుల వల్ల సతమతమైంది. నిజాంల నుంచి ఆంధ్రావారి వరకు దగాపడ్డది. ఆ దగాపడ్డ హృదయాలనుంచే కవిత్వం వచ్చింది. అదే ఒరవడి నూతన తెలంగాణకు కవులను కానుకగా ఇచ్చింది..

ఆ ఒరవడిని కొనసాగిస్తూనే తెలంగాణ కవులు, రచయితల ప్రతిభ ఇప్పడు దేశవ్యాప్తం అవుతోంది. ఆదివారం కరీంనగర్ లో ఎడిటర్ కే.శ్రీనివాస్ గారి పుస్తకాల పరిచయ సభలో పదుల సంఖ్యలో కవులు హాజరై తమ వాగ్ధాటితో సభకు వన్నెతెచ్చారు. తెలంగాణ సాంస్కృతిక వారధికి చుక్కానిలా ఉన్న వారి రచనలు ఇంకా కొనసాగాలని ఆశిద్దాం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *