ఆంధ్రా యాపిల్స్ 3 నెలల్లో అందుబాటులోకి..

విశాఖ : ఆంధ్రా యాపిల్స్ మూడు నెలల్లో తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి రాబోతున్నాయి. విశాఖపట్నం జిల్లా చింతపల్లి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్న యాపిల్ మొక్కలకు పిందెలొచ్చాయి. మరో మూడు నెలల్లో యాపిల్ కాయలు చేతికచ్చే అవకాశముందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. 2014 జనవరిలో 60 యాపిల్ మొక్కలను పరిశోధన స్థానంలో నాటారు. ఈ ఏడాది ఫ్రిబవరి నాటికి మొక్కలు పూత దశకు వచ్చాయి. వీటిని పరిశీలించిన సీసీఎంబీ అధికారులు ప్రయోగం విజయవంతం అయ్యిందని.. రెండేళ్లలో ఆంధ్రా యాపిల్ వాణిజ్యపరంగా మార్కెట్లోకి వస్తుందని తెలిపారు. పూత దశలో కొద్దిగా అనుమానం నెలకొందని.. కానీ యాపిల్ పూత పిందగా మారి ఆకుపచ్చ రంగు నుంచి ముదురు ఎరుపు రంగులోకి మారింది. ఈ యాపిల్స్ పూర్తిస్తాయిలో 3 నెలల్లో కాతకు వస్తాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *