Breaking News

ఆంధ్రా మీడియా దాచేసిందా..?

14rjnews02

తమ వాళ్లు చేస్తే విధి వైపరీత్యం.. పక్కోడు చేస్తే తప్పిదం.. ఇదీ ఆంధ్రా మీడియా నైజం.. పక్క ప్రభుత్వంలో ఇదే విషాధం జరిగితే.. ప్రభుత్వ వైఫల్యం మంటూ నానా యాగీ చేసే ఆంధ్రాచానళ్లు.. రాజమండ్రి విషాదాన్ని ఇదో కామన్ ప్రమాదంగా చిత్రీకరించడం దిగజారుడుతనానికి నిదర్శనం..  ఏ విషాదమైనా ఎవరు రాజకీయం చేసినా తప్పే. రాజమండ్రీలో జరిగింది పెను విషాదం. అందరూ చూస్తుండగానే 35 నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఆంధ్ర సీఎం చంద్రబాబునాయుడు కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు. ఆయన కూడా షాక్కు లోనైనట్టు కనిపించారు. రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న ఘాట్లోకి వీఐపీలంతా వచ్చిపడడం, అధికారులంతా వీఐపీల ధ్యాసలో పడి ప్రమాద పరిస్థితిని అంచనా వేయకపోవడం, సమూహాన్ని వేర్వేరు ఘాట్లలోకి మల్లించకపోవడం ఇంతటి విషాదానికి దారితీసింది. పాలనా యంత్రాంగం ఘోర వైఫల్యం ఇది. చంద్రబాబు ఆ ఘాట్లోనే అంతసేపు పూజలు చేసి వెళ్ళారు కాబట్టి సహజంగానే ఆయననూ తప్పుబడతారు. అందుకే నేను కారణమైతే క్షమించండి అని చంద్రబాబు వెంటనే ప్రాయశ్చిత్తం ప్రకంటించారు.

ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే….మొత్తం మీడియా కూడబలుక్కున్నట్టు, ఇది చాలా సాధారణ విశయమైనట్టు, ఇటువంటి ఉత్సవాలు, సంబరాల్లో అనేక మంది చనిపోవడం ఎప్పుడూ జరిగే విషాదమే అయినట్టు నటించడం. నెంబర్ వన్ ఛానల్గా చలామణి అయ్యే ఓ ఛానల్ ప్రైమ్ న్యూస్ బుల్లెటిన్లో సండ్ర బెయిలు విషయాలపై 15 నిమిషాలు నడిపింది. ఒకటేమిటి ఆంధ్ర ఛానళ్ళు అన్నిటిదీ అదే పాట. ప్రపంచంలో, భారత దేశంలో, సమైక్య రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఇటువంటి ఘోరాలు జరిగాయో ఏకరువు పెట్టాయి. ఈటీవీలోనైతే మాల్యాద్రి అనే టీడీపీ అనే పెద్ద మనిషి ఈ విషాదం ముందే పసిగట్టి సిద్దం చేసి ఉంచుకున్నట్టు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన తొక్కిసలాటల క్లిప్పింగులు చూపుతూ వీర విహారం చేశారు.

ap media

ఇటువంటి ఘటనే తెలంగాణాలో జరిగి ఉంటే ఈ మీడియా ఏమి చేసేదో అందరికీ అనుభవమే. ఈటీవీ వాళ్ళైతే రాజమండ్రి విషాదాన్ని వదిలేసి తెలంగాణా పుష్కర ఘాట్లలో లోటుపాట్ల గురించి ప్రభుత్వాన్ని తిట్టించడం చేస్తూనే ఉన్నారు. తప్పును ఒప్పు చేయడం, గోరంతలు కొండంతలు చేసి చూపడం, కొండన్తలను గోరంతలు చేసి చూపడం వీరు బాగా నేర్చిన విద్య.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *