ఆంధ్రా బ్యాంక్ ఆరోగ్య శిబిరాలు బేష్ : రాజేశ్వర్ తివారీ.

 

  • వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రాజేశ్వర్ తివారీ.

 

ఆంధ్రా బ్యాంక్, ఖాతాదారులకు సేవలందిస్తూనే సామాజిక భాద్యతలో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రాజేశ్వర్ తివారీ అన్నారు.  ఆయన గురువారం ఆంధ్రా బ్యాంక్ సెక్రటేరియట్ శాఖ, యశోదా మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి మరియు  తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

 

సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 10 మంది నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఎండోక్రైనాలజీ, జనరల్ మేడిషన్ విభాగాలలో సుమారు 800 మంది సచివాలయ ఉద్యోగులకు ఉచిత వైద్య పరిక్షలు నిర్వహించి సలహాలు అందచేశారు.  ఈ సందర్భంగా ఆంధ్త్రా బ్యాంక్ జోనల్ మేనేజరు శ్రీ శ్రీధర్ మాట్లాడుతూ, త్వరలో నిమ్స్ ఆసుపత్రికి ఒక అంబులెన్స్ ను ఉచితంగా అoదచేయనున్నామని, సామాజిక సేవా బాధ్యతలో ఆంధ్రా బ్యాంక్ ఎపుడూ ముందుంటుందని అన్నారు.  యశోదా ఆసుపత్రి, మలక్ పేట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. విష్ణు రెడ్డి నేతృత్వంలో డా. రమేష్,                      డా. యశ్విన్, డా. ప్రశీత్, డా. వినయ్, డా. కవిత, డా. వినీత వైద్య పరిక్షలు నిర్వహించారు.

 

ఆంధ్రా బ్యాంక్ సెక్రటేరియట్ శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ Ms. చందామరై  పర్యవేక్షణ లో నిర్వహించిన ఈ ఆరోగ్య శిబిరంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ షేక్ యూసఫ్ మియా, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి మంగమ్మ, పలువురు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts