ఆంధ్రా ఎండీకి పట్టదట.. టీ. ప్రభుత్వానికి గిట్టదట..

అడకత్తెర లో పోకచెక్కలా తయారైంది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో కార్మికుల చర్చలు విఫలమవడంతో సమ్మె కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యోగుల లొల్లి కారణంగా ఆర్టీసీ ఎండీ మధ్యలోనే చర్చను వదిలేసి వెళ్లిపోయాడు. ఇక నుంచి తాను తెలంగాణ ఆర్టీసీ కార్మిక నాయకులతో చర్చించనని.. ఆంధ్రా కార్మికుల సమస్యలు మాత్రమే తీరుస్తానని పేర్కొన్నారు. ఆంధ్రా కేడర్ అధికారి కావడంతో సాంబశివరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనవసరంగా తెలంగాణ కార్మికులతో పెట్టుకోవద్దనే తాను చర్చల నుంచి వైదొలిగి ఇక నుంచి ఆంధ్రా కార్మికులు, ఆర్టీసీ వ్యవహారాలు మాత్రమే చూస్తానని తెలిపారు.

కాగా ఈ వ్యవహారం తెలంగాణ కార్మికులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. తెలంగాణ కార్మికులను ఇటు టీ. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అటు ఆర్టీసీ యాజమాన్యం కూడా తెలంగాణ కార్మికులను చేరదీయడం లేదు. దీంతో టీ. కార్మికులు నలిగిపోతున్నారు. సమ్మె చేస్తున్నా పురోగతి లేకపోవడం పై లోలోపల కుమిలిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాల్సి ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *