
ఆంధ్రా పత్రికలపై మరోసారి ధ్వజమెత్తారు నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. తెలంగాణ రచయితల వేదిక సమావేశం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా 60శాతం వార్తలు ఆంధ్రావే వేస్తున్నారని.. విజయవాడ సంగతులు మనకెందుకు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ధ్వజమెత్తారు. ఆంధ్రాపత్రికలు దేశంలో ఎక్కడా ఆత్మహత్యలు జరగడం లేదంటూ తెలంగాణలో మాత్రమే జరుగుతున్నాయంటూ పత్రికల్లో పతాక శీర్షికల్లో వేస్తున్నారని అదే ఏపీలో జరుగుతలేవా అని కవిత ప్రశ్నించారు.
గోదావరి వట్టిసీమ ఎత్తిపోతలు మొదలైతే ఆంధ్రా పచ్చవడ్డట్టు చూపిస్తున్నారని.. అదే తెలంగాణపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. కాళోజీ నారాయణరావు ఉంటే ఈ ఆంధ్రాపత్రికలపై ఆగ్రహంగా స్పందిచేవారని కవిత తెలిపారు. కావాలనే విషం చిమ్ముతున్న ఆంధ్రా పత్రికల ఆగడాలను సహించమన్నారు.