ఆంధ్రప్రదేశ్ లో ఆగిన ఎన్టీవీ ప్రసారాలు….

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ సెంటర్లల్లో ఎన్టీవీ ప్రసారాలు ఆగాయి. ప్రముఖ కేబుల్ నెట్ వర్క్ లలో ఎన్టీవీ ఛానల్ కనపడటం లేదు. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయనే కారణంతోనే ఆ చానల్ ను ఆపించారనే వాదన సాగుతోంది. నాలుగు రోజుల కిందట ఎన్టీవీ ప్రసారాలు ఆగాయి. కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడాక తిరిగి ప్రసారాలను పునరుద్దరించారు.;
ఓటు నోటు కేసులో టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఏసీబీకి అడ్డంగా చిక్కిన వైనాన్ని ఎన్టీవీ ప్రసారం చేసింది. మిగతా చానాళ్లు వార్తలిచ్చాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీలు ఆ వార్తకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వక పోయినా వాటితో పోల్చుకుంటే ఎన్టీవీ ఎక్కువగానే కథనాలిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ సి.ఎం చంద్రబాబు నాయుడు ఆడియో టేపులను వార్తల్లానే ఇచ్చింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసింది మొదలు తిరిగి వచ్చాక ఏం చేస్తుంది వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో ఎన్టీవీ ప్రసారాలను విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలు వంటి టామ్ సెంటర్లల్లో ఇప్పుడు ఆ చానల్ రావడం లేదు. ఎందుకు ఆపారని సంబంధిత సెంటర్లల్ కేబుల్ యజమానులకు ఫోన్ చేస్తే టీడీపీ యువనేత ఆఫీసు నుంచి ఫోన్లు వచ్చాయి. అందుకే ఆపామని ఎన్టీవీకి సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలోను ఎన్టీవీ జగన్ పార్టీ, కాంగ్రెస్ కు వత్తాసు పలికిందనే ప్రచారం టీడీపీలో ఉంది.
కలం పై కత్తికట్టడం ఎంత వరకు కరెక్ట్ అని మీడియా ప్రతినిధులు అంటున్నా అవసరానికి మించి మసాలలు ఇస్తే కట్ కాకుండా ఎలా ఉంటాయనే ప్రశ్న మరోవైపు టీడీపీ శ్రేణుల నుంచి వినవస్తున్నాయి.. తాము ఎవరికి అనుకూలంగాను, మరెవరికి వ్యతిరేకంగాను వార్తలు ఇవ్వడం లేదని వాస్తవాలను చెబుతున్నామని ఎవరికి వారే టీవీ చానల్ యజమానులు చెబుతున్నా..వాస్తవం ఏంటనేది చూసే వీక్షకులకు అర్థమవుతోంది.
ఖమ్మం జిల్లాకు చెందిన నరేంద్ర చౌదరి ఎన్టీవీకి ఛైర్మన్. ఆయన తెలంగాణ వ్యక్తి కాబట్టే ఆంధ్రప్రదేశ్ లో ప్రసారాలు నిలిపేసినా పెద్దగా తమకు ఇబ్బంది ఉండదనే అభిప్రాయానికి టీడీపీ నేతలు వచ్చారనే వాదనుంది. వాస్తవం ఏదైనా ఎన్టీవీ ప్రసారాలు ఆంధ్రప్రదేశ్ లో ఆగిన వైనాన్ని మరోవైపు సి.ఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్టీవీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో మరి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *