ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ ) రాష్ట్ర అధ్యక్షునిగా ఐవీ సుబ్బారావు

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ ) రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐజేయు నాయకులు కె.శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఎపీయుడబ్ల్యూజె రాష్ట్ర కమిటీ నాయకులు ఎంపిక చేసుకున్నారు. గురువారం విజయవాడ లో ప్రెస్ క్లబ్ లో జరిగిన ఎపీయుడబ్ల్యూజె రాష్ట్ర కమిటీ సమావేశం లో ఐవీ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. రాష్ట్ర  అధ్యక్ష పదవిని ఐవి సుబ్బారావు తో రాష్ట్ర  ఉపాధ్యక్షులైన మండెల శ్రీరామమూర్తి , పసుపులేటి రాము, మచ్చా రామలింగా రెడ్డి , అచ్యుతరావు, ఎస్.కె.బాబు ఆశించారు. అయితే అధ్యక్షుని ఎంపిక కు యూనియన్ లో కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం త్రిసభ్య ఎన్నికల కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు , ఆలపాటి  , డి.సోమసుందర్ లు అధ్యక్ష పదవిపై అన్ని జిల్లాల నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని ఏకగ్రీవ ఎన్నిక కోసం , ఏకాభిప్రాయానికై పోటీలో వున్న అభ్యర్థులతో చర్చించారు. యూనియన్ మరింత పటిష్టం గా నడిపేందుకు కమిటీ, యూనియన్ పెద్దల నిర్ణయానికి అంగీకరించారు. దీంతో కమిటీ నిర్ణయం మేరకు అంబటి ఆంజనేయులు ఐవి సుబ్బారావు పేరును ప్రతిపాదించగా, అందుకు అందరూ అమోదం తెలిపారు.
నూతనంగా ఎన్నికైన సుబ్బారావు కు తూర్పుగోదావరి జిల్లా ఏపీయుడబ్ల్యూజె తరుఫున , రాష్ట్ర  ఉపాధ్యక్షులు మండెల శ్రీరామమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు ఏకాభిప్రాయంతో రాష్ట్ర  అధ్యక్షుడ్ని ఎన్నుకోవడం మంచి శుభపరిణామం అని శ్రీరామమూర్తి పేర్కొన్నారు. సుబ్బారావు ఎంపిక తర్వాత రాష్ట్ర  అధ్యక్షునిగా నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర  అధ్యక్షులు నల్లి ధర్మారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర  అధ్యక్షులు చందు జనార్థన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *