Breaking News

ఆంద్రోళ్లు అనకండి.. చంద్రబాబును సూటిగా తిట్టండి..

Pawan_Kalyan_Latest_Gallery18_small

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసం వీడారు. సోమవారం సాయంత్రం విలేకరులతో రాష్ట్రాల వ్యవహారాలపై సూటిగా మాట్లాడారు. కొంచెం సూటిగా.. సుత్తిలేకుండా.. కొంచెం వ్యంగ్యంగా.. కొంచెం తీపిచేదుగా ఇలా అన్ని రకాలుగా హావభావాలను పలుకుతూ తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న వివిధ పరిణామాలపై తన స్పందనలను తెలియజేశారు.

ప్రతీసారి సీఎం చంద్రశేఖర్ రావు గానీ, హరీష్ రావు గానీ ఆంధ్రోళ్లు, ఆంధ్రాపార్టీ అంటూ చంద్రబాబు,  ఆ పార్టీ నాయకులను తిడుతున్నారని.. కానీ ఆంధ్రా అంటే వారు కాదు అని.. ఆంధ్రాలో వందకు పైగా కులాలు, జాతులు,మతాలున్నాయని.. అందరు కలిసిన సమ్మిళితం ఆంధ్రా అన్నారు.

ఇక నుంచి చంద్రబాబును తిట్టాలనుకుంటే నేరుగా తిట్టాలని.. టీడీపీని సైతం నేరుగా తిట్టాలని అంతేకాని ఆంధ్రా అని మాత్రం కలుపవద్దంటూ తెలంగాణ నాయకులకు సూచించారు పవన్ కళ్యాన్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *