
తిరుపతి, ప్రతినిధి : బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అస్వస్థతకు గురైయ్యారు. మురళీధరరావు ఆదివారం రాత్రి తిరుమలకు కాలి నడకన పయనమైయ్యారు. మార్గమధ్యలో ఛాతీనొప్పి రావడంతో అతన్ని స్విమ్స్ కు తరలించారు. మురళీధరరావు ఆరోగ్యపరిస్థితిపై మంత్రి కామినేని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్విమ్స్ వైద్యులు తెలిపారు.