
తెలంగాణ అసెంబ్లీలో ముంపు మండలాల లొల్లి చిచ్చు రేపింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్దం జరిగింది. ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపింది, సీలేరు ప్రాజెక్టు పోవడానికి కారణమైంది మీరంటే మీరు అని కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వాదులాడుకున్నాయి.
పార్లమెంటు ఏడుమండలాలను కలిపేందుకు బీజేపీ బిల్లు తెస్తే మద్దతిచ్చి మండలాలను కలిపిందేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ ‘ఏడు మండలాలు పోతే పోయాయి.. తెలంగాణ వచ్చింది కదా’ అని సీఎం కేసీఆర్ అన్నారని ధ్వజమెత్తారు. సీఎం ఇలా మాట్లాడితే ఆ ముంపు మండలాలను కాపాడుకునేది ఎలా అని ప్రశ్నించారు. దీనికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ సభ్యులు ప్రకటించారు.
కాగా దీనిపై మంత్రి హరీష్ స్పందిస్తూ.. విభజన బిల్లు లోపభూయిష్టం గా రూపొందించింది కాంగ్రెస్ అని.. ఏడు మండలాలు పోవడానికి కాంగ్రెస్ మద్దతే కారణమని మండిపడ్డారు. మీరే కలుపుతారు.. మీరే ప్రశ్నిస్తారు ఇది ఏంటని ప్రశ్నించారు.