అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటల

తెలంగాణ 2016-17 బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మంత్రి ఈటెల తెలంగాణ నినాదాలు, ఉద్యమం, కేసీఆర్ నాయకత్వంపై ప్రస్తూతించి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

 తెలంగాణ బడ్జెట్ 1 ,30,415 కోట్లతో ఈటెల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతలకు భారీగా నిధులు కేటాయించారు.  వచ్చే ఖరీఫ్ నాటికి 9 గంటల వ్యవసాయానికి విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ పథకాలు, సంక్షేమ పథకాలను బడ్జెట్ లో ఈటెల నిధులను కేటాయించారు. కాగా శాసనమండలి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *