అసెంబ్లీలో ‘నోరు జారిన’ డీకే అరుణ

DK-Aruna-in-Assembly-620x330

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీలో ప్రతపక్షాలు, అధికార పక్షాల మధ్యల వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సభ్యులు నోరుజారుతున్నారు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ సభ్యురాలు డి.కే అరుణ మాట్లాడుతుండగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డిలు అడ్డు తగిలారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన డి.కే అరుణ టీఆర్ఎస్ సభ్యులపై పరుష పదజాలతో నోరు మూసుకోండి అని అన్నారు. దీనిపై టీఆర్ఎస్ వాళ్లు తిట్ల దండకం మొదలు పెట్టడంతో గందరగోళం నెలకొంది.

దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. డీకే అరుణ పద్దతి మార్చుకోవాలని ఇదేమీ మీ గద్వాల సామ్రాజ్యం కాదు అసెంబ్లీ అనడంతో వివాదం మరింత ముదిరింది. అసెంబ్లీలో రౌడీయిజం చేయొద్దంటూ విమర్శలు గుప్పించారు. ఈ గందరగోళం మధ్యే సభను స్పీకర్ వాయిదా వేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *