
శాసన వ్యవస్థ మీద నమ్మకం లేకుండా అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం టి. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకుంటున్న టీడీపీ నాయకుల వైఖరి సంస్కారం లేని వాళ్లు చేస్తున్నట్లు ఉందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వెనుకాడడం లేదని స్ఫష్టం చేశారు.