Breaking News

అసెంబ్లీలో కేసీఆర్ శపథం..

KCR-PowerPoint-Presentation

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ శపథం చేశారు.. తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు ఈ నేలను పచ్చని తెలంగాణగా మారుస్తా.. ఈ బిడ్డకు ఆ బాధ్యతను ఎత్తుకుంటున్నా.. ప్రాణం పోయినా తప్పు చేప్పా.. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరునూరైనా సాధించి చూపిస్తాం..’నని కేసీఆర్ అన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు పైన 450కి పైగా ప్రాజెక్టులు కట్టారు. దీనివల్ల గోదావరిలోకి చుక్క నీరు రావడం లేదని వాపోయారు. అందుకే ఉన్న నీటిని అయినా ఒడిసిపట్టేందుకు తెలంగాణలో ప్రాణహిత , కాళేశ్వరం, ఇచ్చంపల్లి, దుమ్మగూడెం, అలాగే కృష్ణ నదిపై పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు చెప్పారు.

కాగా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ నభూతో నభవిష్యతి అన్న చందంగా అద్భుతంగా సాగింది. ఒక్కో ప్రాజెక్టు సీఎం కేసీఆర్ ఒక సీనియర్ ఇంజినీర్ లా, కంప్యూటర్ పై ఒక గొప్ప సాఫ్ట్ వేర్ నిపుణుడిలా.. కాంగ్రెస్ గత పాలనలో చేసిన అవినీతి, ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యంపై ఒక సాగునీటి నిపుణుడిలా అన్నీ తానై కేసీఆర్ చేసిన ఆల్ రౌండ్ పాత్ర ఆయనను ఉన్నత రాజకీయ వేత్తను చేసింది.. ఈ సందర్భంగా ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతానని కేసీఆర్ శపథం చేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *