అసెంబ్లీలో కేసీఆర్ కొత్త చరిత్ర..

సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కొత్త చరిత్ర సృష్టించారు.  తొలిసారి దేశంలోనే డిజిటల్ చర్చకు నాందిపలికారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై పెద్ద స్క్రీన్ లపై ప్రదర్శన, చర్చను కేసీఆర్ ప్రారంభించారు. దేశంలోనే ఇలా అసెంబ్లీలో స్క్రీన్ లద్వారా వివరిస్తూ చర్చ జరపడం తొలిసారి.. ఈ సందర్బంగా కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు..

తెలంగాణ రాష్ట్రం దశాబ్దాలుగా సమైక్య  రాష్ట్రంలో నీళ్ల దోపిడీతో కూనరిల్లిందని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర ముఖ్యమంత్రుల వివక్ష వల్ల పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు దాదాపు 30కి పైగా బ్యారేజీలు కట్టి జలదోపిడీకి పాల్పడుతున్నాయని కేసీఆర్ గూగుల్ ఎర్త్ ద్వారా భారీ స్ర్కీన్ లు ఏర్పాటు చేసి వివరించారు. దాదాపు 2 పెద్ద స్క్రీన్ లతో కేసీఆర్ దృశ్యాలను చూపిస్తూ వివరించారు.  కేసీఆర్ స్వయంగా గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టుల రీ డిజైన్, కొత్త పథకాల రూపకల్పన, కేటాయింపులపై  సమగ్రంగా వివరించారు.

ఈ అద్భుత ప్రదర్శనకు తెలంగాణ అసెంబ్లీ వేదికకావడం దేశంలోనే కొత్త పోకడకు తెలంగాణ నాంది కావడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *