
ప్రపంచకప్ సమరంలో కీలక ఘట్టానికి వేదికైంది. నేడు జరుగుతున్న సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది.స్టీవ్ స్మిత్ సెంచరీ(105) సాధించాడు. ఓపెనర్ ఫించ్ 81 పరుగులు చేశారు. చివర్లో మిచెల్ జాన్సన్ చెలరేగి ఆడి 9 బంతుల్లో 27 పరుగులు చేయడంతో 50 ఓవర్లలో ఆసీస్ 328 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఇండియా బ్యాటింగ్ చేయనుంది.
ఈమ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నరాల తెగే ఉత్కంఠ మధ్య ఎవరూ గెలుస్తారో ఎవరూ ఓడిపోతారోనన్న ఆసక్తి క్రికెట్ ప్రేమికులను కుదిపేస్తోంది.
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంయా ఫీల్డింగ్ చేస్తోంది.