
ముంబయి (పిఎఫ్ ప్రతినిధి): తాను భారత్-పాక్ మధ్య శాంతికి ఏజెంట్ నని, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తానని ఆయన అన్నారు. తనను పాకిస్తాన్ ఏజెంట్ గా, కసబ్ కు మరో రూపంగా అభివర్ణించడంపై కులకర్ణి తీవ్రంగా మండిపడ్డారు. శివసేన కూడా భావప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని, తమతో ఏకీభవించాలని అన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న విభేధాలను తొలగించడానికే తాను ఈ పస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానని అన్నారు.