అవుటర్ రింగ్ రోడ్డులో వేగనియంత్రణకు చర్యలు..

అవుటర్ రింగ్ రోడ్డులో వాహనాల వేగనియంత్రణకు చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ అన్నారు. శుక్రువారం సచివాలయంలో ఆయన ఛాంబరులో యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అధారిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుటర్ రింగ్ రోడ్డులో 100 కి,మీ. మీటర్ల వేగాన్ని నోటిపై చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుపైన స్పీడు నియంత్రణ సమాచారాన్ని వాహన దారులను తెలిపే విధంగా పైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. రోడ్డు లో ప్రవేశించే చోట్ల, రోడ్డు నుండి బయటకు వేళ్ళే చోట్ల స్పీటు నియంత్రణ సమాచారాన్ని వాహన దారులకు తెలిపే విధంగా సైను బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. రోడ్డు లో ప్రవేశించే చోట్ల, రోడ్డునుండి బయటకు వెళ్ళే చోట్ల స్పీడు నియంత్రణ సమాచారాన్ని వాహన దారులకు తెలిపే విధంగా సైను బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటి కప్పుడు వాహన దారులకు తెలిపేవిధంగా ఒక యాప్ ను రూపొందించనున్నట్లు తెలిపారు. రద్దీగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాహన దారులకు ట్రాఫిక్ మళ్లింపు సూచనలు అందించే విధంగా యాప్ ఉంటుందని అన్నారు. రోడ్లపైన పెట్టే ర్యాంపులను ఆధునీకరించాలని సూచించారు, ప్రతి నెల కొకసారి సమావేశాన్ని నిర్వహించి నగరంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ తమ సమస్యలను ముందుగానే యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అధారిటి కి పంపాలని సూచించారు. బస్ రాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ద్వారా ఉన్న రహదారులలోని స్ధలాన్ని రోడ్డు వాహన దారులందరికి సమానంగా విభజించి వచ్చని తెలిపారు. దీని వలన వాహనాల వేగం పేరుగుతుందని, సురక్షిత ప్రయాణం వీలవుతుందని తెలిపారు. నగరం చుట్టు పక్కల కొత్త ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎం..టి.ఎస్, మెట్రో. ఆర్.టి.సి, పోలీస్ తదితర శాఖలు సమన్వయం తో పనిచేయాలని తెలిపారు. పార్కింగ్ పాలసీపైన విస్తృతంగా చర్చించారు. నగరంలో పార్కింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. నగరంలో ని పోలీస్ కమీషనరేట్ పరిధిలో పార్కంగ్ ప్రాంతాలను నోటీఫై చేయాలని తెలిపారు. ప్త్ర్రెవేటు ఆద్వర్యంలో పార్కింగ్ కాంప్లెక్స్ లను నిర్మించి, నిర్వహించడానికి గల అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని అంతర్గత బస్ టెర్మినల్, ఎం.ఎం.టిసి ఫేస్-2 టోల్ నిర్వహణ విధానం, హైవే ట్రాఫిక్ నిర్వహణ విధానం, ఇంటలిజెన్స్ ట్రాఫిక్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ తదితర అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో హెచ్.యం.డి.ఏ కమీషనర్ శ్రీ చిరంజీవులు యుఎమ్ టిఎ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ నవీన్ మిత్తల్, జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts