అవి మీ ఇంట్లోంచి ఇచ్చిన నిధులు కాదు..

maxresdefault

ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వందల కోట్లు చెల్లించిందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వృథా చేసిందని ఆరోపించారు. ఇటీవల తెలంగాణ బీజేపీ నాయకులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రెండేళ్లలో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చాలా చేసిందని చెప్పారు.

కాగా దీనిపై ఎంపీ కవిత స్పందించారు. రెండేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కవిత వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్దంగా అందాల్సిన నిధులు మాత్రమే రాష్ట్రానికి అందాయని కవిత తెలిపారు. అంతకన్నా తెలంగాణకు అదనంగా ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. ఆ నిధులేవో బీజేపీ ఇంట్లోంచి ఇచ్చినట్టు ఫీలవుతున్నారని.. అన్ని రాష్ట్రాల వలె తెలంగాణకు ఇచ్చారని కవిత విమర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *