అవినీతి నిర్మూలనలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలి

కరీంనగర్: అవినీతి నిర్మూలణలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ మహ్మద్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. అవినీతిని ప్రోత్సహించడం కూడా తప్పిదమని ఆయన పేర్కొన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా అవినీతి నిరోధక శాఖ శుక్రువారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని దివంగత జాన్ విల్సన్ స్మారక ఓపెన్ ఏయిర్ ధియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిపై ప్రతి పౌరుడు పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వివిధ రకాల పనుల కోసం డబ్బులు డిమాండ్ చేసే అధికారులపై ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఏ రూపంలో కూడా అవినీతిని ప్రోత్సహించకూడదని సూచించారు. జిల్లా అవినీతి నిరోధక శాఖ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని ఆయన కొనియాడారు. పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ లంచం తీసుకోవడం, ఇవ్వడం కూడా నేరమన్నారు. అవినీతి అక్రమాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా ఎసిబి అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన చెప్పారు. వారోత్సవాల సందర్భంగా వివిధ స్ధాయిల్లో విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు సర్ఠిఫికెట్లు ఎ.సి.బికి ఫిర్యాదు చేసిన బాధితులకు జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎసిబి డి.ఎస్.పి సుదర్శన్ గౌడ్, ఇన్స్ పెక్టర్ ఎస్. శ్రీనివాసరావు, ఆర్.ఐ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. v-b-kamalasan-reddy         meeting

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.