అవినీతి అంతంతోనే దేశం అభివృద్ధి: ముదుగంటి

జగిత్యాల: కేంద్ర రాష్ట్ర్ర ప్రభుత్వాలు సమగ్రాభివృద్ధికి పలు సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు దరిచేరాలన్న పాలనకే నూతన జల్లాల ఏర్పాటు, నవశకానికి నాంది అని చారిత్రాత్మక నిర్ణయమని కేంద్రము పెద్దనోట్ల రద్దు, సాహసోపేత నిర్ణయమని సమగ్రాభివృద్ధితో సామాన్యులకు సైతము సాధికారత చేకూరుతుందని బహుళ ప్రయోజనాల పధకాలను ప్రవేశపెట్టడము, పనితీరును పరిశీలిస్తే ఆశించిన అభివృద్ధి కానరావడం లేదని ఛైతన్యమే లక్ష్యంగా పౌరులు, యువత అభివృద్ధి సాధించడానికి బహుళ ప్రయోజనాలు పొందడానికి అన్ని దశలలో అభివృద్ధికి అడ్డుగోడగా నిలుస్తున్నా అవినీతి అంతానికి అందరూ సమిష్టిగా క్రియాశీల పాత్ర పోషించడానికి తెలంగాణ జనసత్త వ్యవస్ధాపక రాష్ట్ర్ర అధ్యక్షులు ముదుగంటి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు అవినీతి వ్యతిరేఖ వారోత్సవాల సందర్భంగా యస్.కె.ఎన్.ఆర్. ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై విద్యార్ధులచే అవినీతి వ్యతిరేఖంగా ప్రతిజ్ఞ చేయించిన అనంతరం మాట్లాడుతూ ప్రతీవ్యక్తి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకొని పరిజ్ఞానాన్ని పెంచుకొని అవినీతి రక్కసిని ఏరి పారేయయడానికి అందరూ ఉద్యమించి దేశ సౌభాగ్య సౌధానికి మూల స్ధంభాలుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విక్టోరియా అలెగ్జాండర్, లెక్చరర్స్, విద్యార్ధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.