అవినీతిలో భారత్ కు 76వ ర్యాంకు

images-cms-image-000013179

భారత దేశంలో  అవినీతి మకిలి కొనసాగుతోంది.. ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేసిన  ‘ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషన్ ’ సంస్థ భారత్ గత సంవత్సరం కంటే అవినీతిలో కాస్త మెరుగుపడిందని చెప్పింది.. మనకంటే చైనా, పాకిస్తాన్ లలో ఎక్కువ అవినీతి ఉందని తేల్చిచెప్పింది. అవినీతిలో భారత్ 76వ స్థానంలో ఉంటే మన కంటే చెత్తగా చైనా 83 వ స్థానంలో , పాకిస్తాన్ అయితే 117 స్థానంలో నిలిచింది..

కాగా అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది.. ఫిన్లాండ్ రెండోస్థానంలో, స్వీడన్ మూడో స్థానంలో నిలిచింది.. అమెరికా అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న మొదటిస్థానానికి దరిదాపుల్లోకి రాలేదు. అమెరికా 17 వ స్థానంతో అవినీతి లో కొనసాగుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *