Breaking News

అవసరమైతే మోడీతో కలుస్తావా.?

Akbaruddin-Owaisi-speech-against-Modi-on-Babri-Masjid-Issue57338

తమ పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీలపై దాడులకు పాల్పడ్డ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై నిప్పులు చెరిగారు ఎంపీ వీ.హనుమంతరావు.. అకర్బుద్దీన్ బిన్ లాడెన్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓవైసీ సోదరులను తమ పార్టీ నేతలే నెత్తికి ఎక్కించుకున్నారని గుర్తు చేశారు. ఓవైసీ సోదరులను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. కాంగ్రెస్ ను వాడుకొని వదిలేసినట్టే రేపు టీఆర్ఎస్ పార్టీని కూడా వాడుకొని వదిలేస్తారని హెచ్చరించారు. ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ నాయకత్వలోపంతో ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. ఇక నుంచి హైదరాబాద్ కాంగ్రెస్ ను తామే నడుపుకుంటామని వీహెచ్ పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *