అవయవ దానం చేసి అనంతలోకాలకు..

sisters dead

అక్కకు కాలేయం చెడిపోయింది. బతకడం కష్టమన్నారు. కానీ ఆ చెల్లి ముందుకొచ్చింది. తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి అక్కడను కాపాడుకునేందుకు ముందుకు వచ్చింది. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత ముందు చెల్లి, ఆ తర్వాత అక్క మరణించి ఆ కుటుంబాల్లో ఆవేదనను మిగిల్చారు. అవయవ దానంలో పొరపాటే వారిద్దరి కారణమంటూ కుటుంబ సభ్యులు గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది.

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన అక్కా చెల్లెల్లు దయారాణి, నిర్మలారాణిలు. దయారాణి ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురికాగా వైద్యులు కాలేయం చెడిపోయిందని .. కాలేయ మార్పిడి చేయనిదే బతకదని తేల్చారు. దీంతో ఆమె సోదరి నిర్మలా రాణి అక్కకు కాలేయం ఇవ్వడానికి అంగీకరించింది. వైద్యులు ఆపరేషన్ చేసి నిర్మలారాణి కాలేయంలో కొంత భాగాన్ని దయారాణికి అమర్చారు. ఇందుకు రూ.40 లక్షలు ఖర్చయ్యింది. కానీ దురదృష్టవశాత్తు నిర్మలారాణి తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందింది. శస్త్ర చికిత్స అనంతరం అక్క దయారాణి కూడా మృతి చెందింది. వైద్యులను ఈ విషయం అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో కుటుంబ సభ్యలు ఆస్పత్రి వైద్యులపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చనిపోయి పూడ్చిపెట్టిన అక్కాచెల్లెల్ల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *