అల్లుడు శీను రివ్యూ Movie Review

Movie Name    :  అల్లుడు శీను
censor : A

duration   : 153 mn

genre : ఫ్యామిలీ , యాక్షన్ డ్రామా

Rating    :    2/5

production house    :  శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్

Casting    : బెల్లం కొండ శీను , సమంతా , తమన్నా , బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్ ….. ఇంకా టాలీవుడ్ లో ఉన్న టాప్ యాక్టర్స్ చాలా మంది

Cinematography : చోటా కే నాయుడు

Music    :  దేవిశ్రీ ప్రసాద్

editor : గౌతమ్ రాజు

story : కే . ఎస్ . రవీంద్ర

screen  play, dialogues  : కోన వెంకట్ , గోపీ మోహన్

Producers      : బెల్లం కొండ శ్రీనివాస్

director  : వి . వి . వినాయక్

Released Date :  25- 07-2014

Introduction  : ‘అ …. అ ….. అ ….. అల్లుడు శీను నువ్వు అడుగుపెడితే సూపర్ హిట్టే ఎవ్రీ శీను… ‘ అని హీరోయిన్…. హీరో ని  పొగిడితే…. ‘ నేను అడుగుపెడితే సిల్వర్ స్క్రీనే షేక్ అయిపోద్ది .. ‘ అని హీరో తన గురించి తానే చెప్పుకుంటాడు. ఈ సెంటెన్స్ లు  విన్న వాళ్ళకు మాత్రం …. ఆ మధ్య తెలుగు నుంచి బాలీవుడ్ లో ‘తుఫాన్ ‘ సృష్టిద్దామని వెళ్లి … ‘ముంబై మొత్తం నాకే సల్లామ్… ‘ అంటుంది అని చెప్పి బొక్క బోర్లా పడ్డ ధీరుడు గుర్తొచ్చాడు. మాములుగా అయితే ఒక తెరంగేట్ర హీరో కి ఇంత సీన్ అవసరం లేదేమో కానీ…’ బెల్లం కొండ ‘ లాంటి భారీ ప్రొడ్యూసర్ బ్యాక్ గ్రౌండ్ లో  ఉంటే మాత్రం ఈ స్థాయిలో ఉండాల్సిందే అని అనుకున్నట్టున్నారు.

అందుకే టాపర్స్.. టాప్ డైరెక్టర్ వినాయక్, టాప్ హీరోయిన్ సమంతా, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ , టాప్ రైటర్ కోన వెంకట్ , టాప్ కమెడియన్ బ్రహ్మానందం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐటెం సాంగ్ కు కూడా టాప్ హీరోయిన్ తమన్నా ….. అబ్బో అందరూ టాపర్ లే. అందుకే బడ్జెట్ కూడా టాప్ రేంజ్ లో నలభై కోట్లకు రీచ్ అయిందని టాక్ . కొత్తవాడైన తన  కొడుకు శ్రీను కొన్ని విషయాలలో ఫెయిల్ అయినా ఈ టాపర్స్ అందరూ సినిమాను సూపర్ హిట్ చేస్తారని బెల్లం కొండ భావించినట్టున్నాడు. మరి ఈ టాపర్స్ ఆయన నమ్మకాన్ని నిలబెట్టారా ? ఈ అల్లుడి కథ కూడా టాప్ లోనే ఉందా? కొడుకు ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి… శ్రీను సీన్ ఓ టాప్ స్టార్ రేంజ్ లో ఉండాలి… అని ఆశిస్తున్న బెల్లం కొండ ఆశలు ఫలిస్తాయా ? మనమూ ఓ లుక్కేద్దాం రండి .

Plot:   ఓ హీరో …. వాడికో మంచి మామయ్య ….. కొన్ని వెధవ పనులు చేసినా హీరో బాచ్ కాబట్టి వీళ్ళు మంచి వాళ్ళు . ఈ మామయ్య లానే ఉండే ఓ పెద్ద విలన్ . వాడికో కూతురు. ఆ కూతురు హీరోయిన్ కాబట్టి మన హీరో ఆ అమ్మాయిని ఫస్ట్ లుక్ లోనే లవ్ చేసేస్తాడు. ఇదే హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని దుబాయ్ లో ఉండే ఇంకో పెద్ద విలన్ కొడుకు ఇండియా వస్తాడు. హీరోయిన్ ని ప్రేమించిన హీరో …. ఆ విలన్ లు అందరినీ వెర్రి పప్పలను చేసి ………..       చాళ్ళే…. చెప్పొచ్చావ్  ఈ కథ మేము ఆల్రెడీ చాలా సార్లు చుసేశాం అంటారా?  అయితే ఓకే . మీకు కథ తెలుసు కాబట్టి మిగతా విషయాలు మాట్లాడుకుందాం.

Performance    : కొత్తగా ఎవరూ ఏమీ చేయలేదు. ప్రకాష్ రాజ్ , సమంతా , బ్రహ్మానందం , భరణి అండ్ మిగతా బాచ్ అందరూ ….. ఒక్కళ్ళు కూడా కొత్తగా ఏమీ చేయలేదు. ఆల్రెడీ చాలా సినిమా లలో ఇదే పాత్రలలో చేసి ఉన్నారు కాబట్టి ……. ఆ అనుభవం తో బాగానే చేశారు. ఇక కొత్తగా వచ్చిన కుర్రాడు… నలభై కోట్లు ఖర్చు పెట్టించిన హీరో అంటారా ….. యాక్టింగ్ తప్ప …. ఫైట్ లు , డాన్సు లు చిమ్పేశాడు.

Technical  : కెమెరా సూపర్బ్ . ఫైట్ లు సూపర్ . ఇదే స్టొరీ ఇంతకుముందు సినిమా లలో మొదటగా రాసినవాడు ఎవడో వారికీ క్రెడిట్ ఇవ్వాలి . కోన వెంకట్ గారు  డైలాగు లు , స్క్రీన్ ప్లే రాయటం మర్చిపోయాడో…. ఈ హీరో కి ఇదే ఎక్కువ అనుకున్నాడేమో తెలియదు. వినాయక్ మాత్రం సిన్సియర్ గా కష్టపడ్డాడు. తనకు తెలిసిన అన్ని విద్యలూ… ఆది సినిమా నుంచి చేసుకుంటూ , నేర్చుకుంటూ వచ్చిన అన్ని టెక్నిక్ లూ బాగానే ట్రై చేశాడు. కొత్తగా ఏమైనా చేసి ఉంటె బాగుండేది.

Highlights  :       భారీ బడ్జెట్ …… ఆ డబ్బులు  పెట్టిన ప్రొడ్యూసర్
భారీ అందాలు…. సమంతా అయితే సెన్సార్ పరిధిలో చూపించటానికి ఇంక బాలన్సు ఏమీ లేదు … తమన్నా కూడా బాగానే చూపించింది
భారీ డాన్సు లు …. అబ్బో అందరూ మెలికల్లా తిరిగిపోయారు
భారీ ఫైట్ లు …… ధూమ్ రేంజ్ లో ట్రై చేశారు … జంపింగ్ లు , ఎయిర్ పోర్ట్ లో చేజ్ లు
భారీ తారాగణం…. హీరో తప్ప అందరూ భారీగా డబ్బు తీసుకునే వాళ్ళే

Drawbacks  :   ఇన్ని భారీలుంటే ఇక కథ ఏమి ఉంటుంది. అందుకే కథకు ప్లేస్ లేదు.
ఇంకో పెద్ద మైనస్ ఉంది . చెప్తే బెల్లం కొండ సురేష్ ఫీల్ అవుతాడేమో కానీ … ఇంకా యాక్టింగ్ అది బాగా నేర్పిస్తే ఛాన్స్ లు ఉన్నాయేమో కానీ ఈ సినిమా వరకూ అయితే మైనస్
డాన్సు లు , ఫైట్ లు , సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్…. అన్నీ కూడా మూసగా ఉండటం …. కొత్తగా లేకపోవడం

Analysis:భారీ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ … తన కొడుకు ను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేయటానికి…. మిగతా అన్ని విషయాలను భారీ గా ప్లాన్ చేశాడు. అదే శ్రీనివాస్ కి మైనస్ అయింది. అంతమంది పెద్దవాళ్ళ మధ్య శీను చిన్నవాడు అయిపోయాడు. సినిమా లోనే ఓ చోట చెప్పినట్టుగా చరణ్ కోసం  అల్లు  అరవింద్, చిరంజీవి ప్లాన్ చేసినట్టుగా చిరుత ను ఫాలో అయి ఉంటె బాగుండేది. 6 సాంగ్స్ .. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఫైట్ లు … ఎక్కువమంది విలన్ లు …. ఇన్ని విషయాలు మస్ట్ అనుకునేసరికి కథ లో విషయం లేకుండా పోయింది. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి కథ అర్థమైపోతుంది. ఆ తర్వాత వచ్చిన ట్విస్ట్ లు అన్నీ ఆడియెన్స్ చెప్పేస్తూ ఉంటారు.

ఇంత భారీ కాన్వాస్ కి టీనేజర్ ల ఉన్న శ్రీను సీన్ సరిపోలేదు. సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళకు హీరో నే మైనస్ అనిపించేలా అన్ని మైనస్ లనూ దాటేశాడు. బెల్లం కొండ ప్లానింగ్ కొత్త హీరో కి మైనస్ అయింది . డాన్సు లు , ఫైట్ లు బాగానే నేర్చుకున్న హీరో … ఇంకొంచెం యాక్టింగ్ అది కూడా నేర్చుకుంటే నెక్స్ట్ సినిమా లలో అయినా హీరో గా నిలబడతాడేమో చూడాలి . ముందు డైలాగ్ లు పలకడం అయితే చాలా ప్రాక్టీసు చేయాలి.

Bottom Line :ఆరు పాటలు , హీరోయిన్ ల అందాలు,ఫైట్ లు ఉంటె చాలు అనుకుంటే ఈసినిమామీకోసమే

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.