అల్లుడు వెన్నుపోటు పొడిచేందుకు రెడీగున్నడు..

హైదరాబాద్ : టీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన విమర్శలపై ధీటుగా సమాధానమిచ్చారు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి. టీడీపీని చూస్తే కేసీఆర్ కు వనుకు వస్తుందన్నారు. మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయగా మార్చి టీఆర్ఎస్ నేతలు పైసలు పంచుకుతింటున్నారని విమర్శించారు. ప్రతీదానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడలేక విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నాడన్నారు.

కరెంటు కష్టాలు లేవంటున్న కేసీఆర్ .. అసలు వ్యవసాయం చేయలేక రైతులు పంటలు వేయలేదని.. అందుకే మిగులు కరెంటు ఉందన్న వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు టీడీపీ అవసరం లేదని.. మీ అల్లుడు హరీష్ రావు కేసీఆర్ ను టీఆర్ఎస్ ను వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నాడని విమర్శించారు. ఇది అప్పట్లో వైఎస్ ఉన్నప్పుడే జరిగేదని.. కానీ అప్పుడు సర్ధుకున్నా.. భవిష్యత్తులో టీఆర్ఎస్ , కేసీఆర్ ను దించేసి పగ్గాలు చేపట్టేది హరీష్ రావేనని పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *