
-టీయూడబ్ల్యూజే(ఐజేయూ) లో చేరిక
హైదరాబాద్, ప్రతినిధి : ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సారథ్యంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (tuwj)కు మరో షాక్ తగిలింది. ఆ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, నమస్తే తెలంగాణ కరీంనగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బల్మూరి విజయసింహారావు tuwjకి రాజీనామా చేశారు. అనంతరం ఐజేయూ అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (TUWJ-IJU)లో చేరారు. టీయూడబ్ల్యూజే నేతలు దేవులపల్లి అమర్, కే.శ్రీనివాసరెడ్డి సమక్షంలో యూనియన్ లో చేరారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవలే అల్లం సంఘానికి ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పని చేసిన దొంతు రమేశ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయసింహారావు కూడా రాజీనామా చేయడంతో సంఘానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది. తమ ఆకాంక్షలకు అనుగుణంగా లేని సంఘంలో నుంచి తెలంగాణ జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న టీయూడబ్ల్యూజే-ఐజేయూలో చేరుతున్నామని వారు ప్రకటించారు. మున్ముందు కూడా వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా అల్లం నారాయణ సారథ్యంలోని సంఘం తెలంగాణ జర్నలిస్టుల హక్కుల సాధనలో విఫలమైనట్టు ఈ 9 నెలల కాలంలో సాధించిన ప్రగతిని బట్టి అర్థం అవుతోందని వారు అభిప్రాపడ్డారు.