Breaking News

‘అల్లం’ సంఘానికి దొంతు రాజీనామా..

allam-dontu

హైదరాబాద్, ప్రతినిధి : ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొనసాగుతున్న అల్లం నారాయణ నేతృత్వంలోని టీయూడబ్ల్యూజే కి ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న దొంతు రమేశ్ రాజీనామా చేశారు. దొంతురమేశ్ ప్రస్తుతం టీవీ9 వరంగల్ రిపోర్టర్ గా కొనసాగుతున్నారు.

ఆయన తన రాజీనామా లేఖలో అల్లం నారాయణ సంఘంపై ధ్వజమెత్తారు.. సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయి.. పదవీ కాంక్షతో జర్నలిస్టుల సంక్షేమాన్నిపెడచెవిన పెట్టి మోసం చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టీయూడబ్ల్యూజే విఫలమైందని విమర్శించారు. నూతన రాష్ట్రంలో పోరాట స్ఫూర్తి ని ప్రదర్శించడంలేదని.. టీవీ9, ఏబీఎన్ ల నిషేధించినా మీడియావైపు నిలబడిన సంఘం టీయూడబ్ల్యూజే అని ఆయన లేఖలో విమర్శించారు.

దొంతు రాజీనామా లేఖలో టీయూడబ్ల్యూజేపై విసిరిన విమర్శనాస్ర్తాలు ఇవీ..
1.టీవీ9, ఏబీఎన్ చానాళ్ల నిషేధంపై మీడియా వైపు నిలబడకపోవడం..
2.జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఆంధ్రాలో పంచినా.. తెలంగాణలో ఇప్పటికీ యూనియన్ ఇప్పించకపోవడం..
3.డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేకపోవడం..
4.కొత్త అక్రిడేషన్ లు ఇప్పించలేకపోవడం
5. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో స్తబ్ధతను ఛేదించలేకపోవడం
6.బడ్జెట్ లో జర్నలిస్టుల భవన్ కు 10 కోట్లు కేటాయించినా ఇప్పటికీ వరకు అతీగతీ లేకపోవడం..

పైవన్నింటిపై పోరాడడంలో టీయూడబ్ల్యూజే విఫలమైందని.. యూనియన్ ను నమ్ముకున్న జర్నలిస్టు మిత్రులకు న్యాయం జరగకపోవడంతో వేధనకు గురై రాజీనామా చేస్తున్నానని దొంతు రమేశ్.. అల్లం నారాయణకు లేఖ రాసి సంఘానికి రాజీనామా చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *