Breaking News

అల్లం నారాయణకు పితృవియోగం

narayana

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు పితృవియోగం కలిగింది.. ఆయన తండ్రి అల్లం నర్సయ్య (82) మృతిచెందారు. కరీంనగర్ జిల్లా మంథని మండలం గాజులపల్లి నివాసి అయిన అల్లం నర్సయ్య కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించగా.. హైదరాబాద్ ఆస్పత్రిలో మృత్యువాత పడ్డారు.

కాగా అల్లం నారాయణ తండ్రి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. నర్సయ్య అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, మానకొండుర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధా కార్యదర్శి విరాహత్ అలీ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్, గాండ్ల శ్రీనివాస్, హెచ్యూజే ప్రెసిడెంట్ కోటిరెడ్డి, రాష్ట్ర కోశాధికారి మహిపాల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతు రమేశ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు శివకుమార్, ఎలగందుల రవీందర్ , అల్లం నారాయణ నేతృత్వంలోని టీయూడబ్ల్యూజే నాయకులు క్రాంతి కిరణ్, పల్లె రవి, రమణ , పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *