అల్ఫోర్ హైస్కూల్ లో విద్యార్ధులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన సదస్సు

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని మరియు ప్రజల యొక్క శ్రేయస్సు మీద ప్రభావం ఉంటుందని అల్ఫోర్ విద్యాసంస్ధల అధినేత శ్రీ వి. నరేందర్ రెడ్డి గారు నగర శివారులోని కొత్తపెల్లిలోని అల్ఫోర్ హైస్కూల్(సి.బి.ఎస్.ఇ)లో ఏర్పాటు చేసినటువంటి విద్యార్ధుల ఎన్నికల అవగాహన సదస్సును ప్రారంభించి మాట్లాడారు. ప్రారంభ ఉపన్యాసములో శ్రీ వి. నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశములో నిర్వహించే అటువంటి ఎన్నికల ప్రక్రియ ఇతర దేశాలకు సైతం ఆదర్శనీయమని తెలుపుతూ విద్యార్ధులకు ఎన్నికలపట్ల అవగాహన కల్పించుటకై మరియు ఎన్నికల సిబ్బంది వారు అవలంబించే అటువంటి విధానం మరియు అమలు చేస్తున్నటువంటి నియమావళిని, నియనిబంధనలను ప్రత్యక్షంగా తెలియజేయడానికి ప్రతి సంవత్సరం పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభముకాగానే ఎన్నికలను నిర్వహించడం ఆనవాయితిగా జరుగుతున్నదని తెలిపారు. ఎన్నికలలో భాగంగా విద్యార్ధులకు కేటాయించినటువంటి గుర్తులను వారు వివిధ తరగతులకు వెళ్లి కేటాయించినటువంటి గుర్తులను వారు వివిధ తరగతులకు వెళ్లి కేటాయించిన గుర్తుల మీద ప్రచారం చేసి ఓట్ల కోసం అభ్యర్ధించారు. పాఠశాలలోని విద్యార్ధులను మహత్మ గాంధీ హౌజ్, సుభాస్ చంద్రబోస్ హౌజ్, స్వామి వివేకానంద హౌజ్ మరియు మదర్ ధెరిసా హౌజులుగా విభజించడం జరిగిందని తెలిపారు. వివిధ హౌజులకు గాను విద్యార్ధులు కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. పాఠశాలలో నిర్వహించినటువంటి ఎన్నికల ప్రక్రియ సాధారణ ఎన్నికలను తలపించేట్లుగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.

alphore high school.     alphore high school

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *