అల్ఫోర్ మ్యాధ్స్ ఒలంపియాడ్ టెస్టుకు అనూహ్య స్పందన

శ్రీ శ్రీనివాస రామానుజన్ గారు భారతదేశంలోనే ఒక గొప్ప గణిత శాస్త్త్ర్రవేత్త అని ఆయన యావత్ ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిచారని అల్ఫోర్స్ ఇ-టెక్నో అధినేత శ్రీ.వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఎ.సి జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసినటువంటి అల్ఫోర్స్ మ్యాధ్స్ ఒలంపియాడ్ టెస్ట్ ను శ్రీ శ్రీనివాసరామానుజన్ గారి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్ధల ఆవిర్భావం నుండి ఈ పరీక్షను దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం సైతం నిర్వహించిన పరీక్షకు అనూహ్యంగా కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి పలు పాఠశాలల నుండి 4789 మంది విద్యార్ధులు హజరయ్యారని తెలిపారు. పరీక్షా ప్రారంభానికి ముందు శ్రీ.వి.నరేందర్ రెడ్డిగారు ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాలను ఈ నెల 15వ తేదీన ఎస్.ఎమ్.ఎస్ ద్వారా ప్రకటించడం జరుగుతుందని తెలుపుతూ 21,22 న కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్ఫోర్స్ మ్యాధ్స్ ఫెయిర్ – 2016 ను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియ జేశారు. విజేతలకు అతిధుల చేతుల మీదుగా సన్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్ధినీ, విద్యార్ధులు సద్వినియోగం చేసుకోగలరని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

alphore

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.