అల్ఫోర్ జూనియర్ కళాశాల విద్యార్ధినికి గౌరవ సన్మానం

అల్ఫోర్ జూనియర్ కళాశాల విద్యార్ధినికి గౌరవ సన్మానం

నేటి పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్ధి ధృఢసంకల్పంతో మెదలాలని, పోటీతత్వంతో ఉండాలని అల్ఫోర్స్ విద్యాసంస్ధల అధినేత శ్రీ.వి. నరేందర్ రెడ్డి గారు స్ధానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్ధల్లోని విద్యార్ధులు అన్ని రంగాల్లోను అత్యుత్తమ విజయాలను సాధిస్తూ ముందంజలో నిలవడం చాలా హర్షదాయకమని తెలుపుతూ నిన్న స్ధానిక కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎక్త్సెజ్ భవన్ లో ప్రొహిబిషన్ & ఎక్త్సెజ్ డిపార్ట్ మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రతిభా పురస్కార్ ప్రధాన కార్యక్రమంలో గౌరవ ఎక్త్సెజ్, క్రీడల, యువజన సర్వీసుల శాఖా మాత్యులు శ్రీ పద్మారావు గౌడ్ గారు మరియు శాసయ మండలి చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు స్ధానిక కళాశాలకు చెందినటువంటి ఆర్. హర్షిణి, ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం, పదవతరగతిలో 10 జి.పి.ఎ ను సాధించినందుకు ఘనంగా సన్మానించడమే కాకుండా 5000 రూపాయల నగదు బహుమతిని విద్యార్ధినికి అందజేయడం చాలా సంతోషకరమని తెలిపారు. కళాశాల విద్యార్ధినిని సన్మానించినందుకు గౌరవ మంత్రివర్యులకు శాసనమండలి చైర్మన్ కు, జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ గారికి, నగర మేయర్ శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారికి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సన్మానం పొందటం వల్ల కళాశాల ప్రాంగణంలో విద్యార్ధినిని పుష్పగుచ్చంతో సత్కరించి భవిష్యత్తులోను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్ పాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్ధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *