‘‘అల్ఫోర్స్’’లో మ్యాధ్స్ ఒలంపియాడ్ టెస్ట్

భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ గణాతశాస్త్ర్ర నిపుణులు, శ్రీ శ్రీనివాస జన్మదిన ఉత్సవాలను పురస్కరించుకొని డిసెంబర్ 11వ తేదీన ఉదయం 10.00 గంటల నుండి ప్రతిష్టాత్మక ఏఎమ్ఓటి-2016(ఆల్ఫోర్స్ మ్యాధ్స్ ఒలంపియాడ్ టెస్ట్)నిర్వహించనున్నట్లు ఆల్పోర్స్ విద్యాసంస్ధల అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ టెస్టును 7వ,8వ,9వ, 10వ తరగతి విద్యార్ధినీ, విద్యార్ధులు ఈ టెస్ట్ రాయడానికి అర్హులని ఆయన తెలిపారు. ఈ టెస్టుకు సంబంధించిన ప్రశ్నాపత్రంలో 20 మార్కులకు గాను, ఫిల్ ఇన్ ది బ్యాంక్స్ ప్రశ్నలు, 30 మార్కులకు గాను మ్యాచ్ ది ఫాలోయింగ్ ప్రశ్నలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ టెస్టుకు సంబంధించిన సిలబస్ 7వ,8వ,9వ, 10వ తరగతులలోని ఫండమెంటల్స్ ,జనరల్, మ్యాధ్స్ కు సంబంధించినవి ఉంటాయని ఆయన తెలిపారు. ఈ పోటీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధినీ, విద్యార్ధులకు ప్రతి తరగతిలో మొదటి టాపర్ కు 5000 రూపాయలు, రెవడవ టాపర్ కు 3000 రూపాయలు, మూడవ టాపర్ కు 2000 రూపాయలు బహుమతిగా అందిస్తామని నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో వావిలాలపల్లి లోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో కళాశాల, చొప్పదండి నియోజకవర్గంలోని గోపాల్ రావు పేట లో గల ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ పరీక్షా కేంద్రాలుగా ఏప్పాటు చేసినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫర్స్ జూనియర్ కళాశాల, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ లోగల ఆల్ఫోర్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్ట్స్ల్ల్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. జాతీయ గణాతశాస్త్ర్ర దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 20,21,22 తేదీలలో కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో మ్యాధ్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించనున్నట్లు అలాగే ఈ నెల 22వ తేదీన గణితశాస్త్ర్ర ల్యాబ్ ను ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభిస్తారని నరేందర్ రెడ్డి తెలిపారు. రామానుజన్ జన్మదినోత్సవాలలో మంత్రి రాజేందర్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయనున్నట్లు ఆల్ఫోర్స్ విద్యాసంస్ధల అధినేత శ్రీ వి. నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

About The Author

Related posts